మమ్మల్ని విమర్శించే ముందు.. ఇలాంటి వాటికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు: హరీశ్ శంకర్

తెర వెనుక ఉండే దర్శకులు కెమెరా ముందుకు వచ్చారు. స్కిట్ వేశారు. కానీ ఆ స్కిట్‌ను విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ కథనం రాయడం చర్చనీయాంశంగా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని దర్శకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు దర్శకుల సంఘం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ స్కిట్ వేశారు. దీనిని విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ కథనం రాసింది. దీనిపై హరీశ్ ఫైర్ అయ్యారు.

‘డియర్‌ వెబ్‌సైట్‌.. దర్శకులుగా మేం కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని మాకు తెలుసు. కానీ మమ్మల్ని విమర్శించే ముందు.. ఈ స్కిట్‌ మేం అవసరాల్లో ఉన్న దర్శకులకు విరాళాలు సేకరించేందుకు వేశామన్న సంగతి తెలుసుకోండి. మా సినిమాల రివ్యూలను స్వేచ్ఛగా రాయండి.. అంతేకానీ ఓ మంచి ఉద్దేశంతో ఐకమత్యంతో మేం చేసే కార్యక్రమాలకు రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని హరీష్‌ ట్వీట్‌ చేశారు.
Go Back to Shorts
Harish Shankar
Anil Ravipudi
Dasari Narayana rao
Website
Twitter
Hyderabad

More Telugu News